వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు

గుంటూరు: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులో జరిగే వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో అసత్య ప్రచారాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, సాధిస్తామన్న టీడీపీలు రెండూ కలిసి ప్రజలను నట్టేట ముంచాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే తీర్మానానికి వచ్చారని, చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలన్నా.. ప్రాజెక్టులు పూర్తికావాలన్నా.. వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే భవిష్యత్తు అని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం నవరత్నాలు ప్రకటించారని, వాటిని ప్రజలకు చేరేవేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తుంది. వైయస్‌ జగన్‌ సీఎం అవ్వడం తథ్యమన్నారు. 
Back to Top