దళితజాతిపై చంద్రబాబుకు గౌరవంలేదు

ఏ మొహం పెట్టుకొని రాష్ట్రపతిని కలిశారు
అట్రాసిటీ చట్టాన్ని కొనసాగించాలని వైయస్‌ జగన్‌ ఏప్రిల్‌ 2నే లేఖరాశారు
దళిత రాష్ట్రపతికి ప్రతిపక్షనేత పాదాభివందనం చేస్తే దుష్ప్రచారం చేశారు
సాక్షాత్తు ముఖ్యమంత్రే దళితులను కించపరిచారు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారు
అంబేద్కర్‌ 125ల విగ్రహం, స్మృతివనం ఏమైంది
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ పార్టీ నేతలకు దళిత జాతిపై గౌరవమే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై విపరీతమైన దాడులకు తెగబడుతూ.. ఏం మొహం పెట్టుకొని అట్రాసిటీ చట్టాన్ని కొనసాగించాలని టీడీపీ బృందం రాష్ట్రపతిని కలిసిందని ప్రశ్నించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 2వ తేదీనే ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాశారన్నారు. 

ఆంధ్రరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దాడుల గురించి రాష్ట్రపతి టీడీపీ బృందాన్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని సురేష్‌ ప్రశ్నించారు. దళిత రాష్ట్రపతిని గౌరవించే సాంప్రదాయంలో భాగంగా వైయస్‌ జగన్‌ వారికి పాదాభివందనం చేస్తే టీడీపీ నేతలు అన్యాయంగా మాట్లాడి దుష్ప్రచారం చేశారన్నారు. దళితులంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అమానుషంగా మాట్లాడారన్నారు. ఆయనపై కేసులు నమోదు చేయరా..? అదే విధంగా మంత్రి ఆదినారాయణ హాస్టళ్ల తనిఖీలో భాగంగా దళితులు శుభ్రంగా ఉండరని వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దళిత లోకాన్ని కించపరిచారన్నారు. అదే విధంగా ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కులం పేరుతో చెప్పలేని భాషలో ఎస్సీ విద్యార్థిని పట్టుకొని దుర్భాషలాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో దళిత మహిళలపై జరిగిన దాడుల్లో నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ఇచ్చిన నివేదికలో ఆంధ్రరాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. వీటన్నింటిపై రాష్ట్రపతి అడిగితే ఏం సమాధానం చెబుతారన్నారు. 

నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు పరిపూర్ణంగా ఒక్క సంవత్సరమైనా అమలు చేయలేదన్నారు. దళితవాడల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది 14వ ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల వల్లేనన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పక్కారోడ్లు, కరెంటు, డ్రైనేజీ సదుపాయాలు ఇవ్వడం లేదని వేలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కుల వివక్ష ఉందన్నారు. నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని విచారణకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారన్నారు. 

ఎస్సీ, ఎస్టీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సురేష్‌ అన్నారు. ఎస్టీ శాఖకు మంత్రి వర్గంలో స్థానంలో లేదని, మైనార్టీలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం లేదన్నారు. రాష్ట్రంలో దళితులంటే ప్రభుత్వానికి గౌరమేలేదన్నారు. దళితులకు భూములు ఇవ్వకపోగా వారి భూములు లాక్కుంటున్నారన్నారు. ఎస్టీ, ఎస్టీల హాస్టళ్లు వేల సంఖ్యలో మూసివేయించారన్నారు. విద్యార్థుల మెస్‌బిల్లులు, స్కాలర్‌షిప్‌లు పెంచేందుకు మనసురాదు కానీ కాంట్రాక్టర్‌లకు అంచెనాల పెంచడానికి మనసు వస్తుందా అని ప్రశ్నించారు. ఇన్ని మోసాలు చేస్తే దళితుల కోసం కష్టపడుతున్నామని ఏం మొహం పెట్టుకొని రాష్ట్రపతిని కలిశారన్నారు. 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్న మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, ఆయనకు ఓటు వేయొద్దని చెప్పారన్నారు. 

రాజధానిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏమైందని ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే ఆ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు అంబేడ్కర్‌ విగ్రహం అంటూ మాట మార్చారన్నారు. నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ అంబేడ్కర్‌ విగ్రహా పునాధికి ఒక తట్ట మట్టి కూడా పడలేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత, బహుజన, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. ఓటుకు కోట్ల కేసు విషయాన్ని బుల్డోజ్‌ చేయడానికి, ఎయిర్‌ ఏషియా సీబీఐ ఎంక్వైరీని నిలుపుదల చేసేందుకు టీడీపీ బృందం రాష్ట్రపతిని కలిసిందని మేం కూడా ఆరోపణలు చేయవచ్చని కానీ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయన్నారు. టీడీపీకి విలువలు లేవని, అందుకే అడ్డంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు. 
Back to Top