హోదా కోసం ప్రాణాలైనా అర్పిస్తాం

విశాఖ‌: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ప్రాణాలైనా అర్పిస్తామ‌ని ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామ‌ని చెప్పారు. చంద్రబాబు సొంతమామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా రాజ్యాధికారంలోకి వచ్చిన వ్యక్తి అని విమ‌ర్శించారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఏ రోజు కూడా అర్దం చేసుకోలేని వ్యక్తి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తి వెంకన్న, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వ్యక్తులుగా మోది, చంద్రబాబు అని ధ్వ‌జ‌మెత్తారు.

Back to Top