మహానేత వైయస్‌ఆర్‌ రుణం తీర్చుకుందాం

మైనార్టీలమంతా వైయస్‌ జగన్‌ వెంట నడుద్దాం
జననేతను సీఎం చేస్తేనే బతుకులు బాగుపడతాయి
12న విశాఖలో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం 
విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నేతల పిలుపు
హైదరాబాద్‌: ముస్లిం మైనార్టీలను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీ సెల్‌ నేతలు గుర్తు చేశారు. మహానేత తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఆ రుణం తీర్చుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ కార్యదర్శి రెహ్మన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీ సెల్‌ ఏపీ అధ్యక్షుడు ఖాదర్‌భాషా, రెహ్మన్, బేగ్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెహ్మన్‌ మాట్లాడుతూ.. విశాఖలో వైయస్‌ జగన్‌ అధ్యక్షతన 12వ తేదీన నిర్వహించనున్న ముస్లింల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముస్లింలు సమావేశానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కేబినెట్‌లో ముస్లిం మంత్రి లేకుండా ప్రభుత్వం నడుపుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ముస్లింల అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. చంద్రబాబు, నరేంద్రమోడీ, సోనియాగాంధీ ఎవరూ ముస్లిం మైనార్టీలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు.  
20లో ఒక్కటైనా నెరవేర్చావా బాబూ: ఖాదర్‌ భాషా
ఇచ్చిన హామీలను అమలు చేయాలని నారా హమారా.. సభలో ఫ్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌భాషా మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీన విశాఖలో జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముస్లిం ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తానని వైయస్‌ జగన్‌ ప్రతీ సభలో చెబుతున్నారన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మౌజన్‌లకు రూ. 5 వేల జీతం, ఇమామ్‌లకు రూ. 10 వేల జీతం ఇస్తానని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగా మైనార్టీ సబ్‌ప్లాన్, అదే విధంగా దుల్హన్‌ పథకం కింద పెళ్లికి ఒక నెల ముందే రూ. లక్ష, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ముస్లిం మహిళలకు రూ. 2 వేలు ఇస్తానని ప్రకటించారన్నారు. 2014లో మైనార్టీల కోసం 20 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 
వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తాం: బేగ్‌
చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేయాలని చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ నేత బేగ్‌ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి అభివృద్ధికి పాటుపడిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. మైనార్టీలంతా వైయస్‌ జగన్‌ బాటలోనే నడుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల మేలు కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగుతారన్నారు. 
 
Back to Top