చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం


మైనారిటీ నాయకుడు రహిమాన్‌
విశాఖ: చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని, ఒక కన్ను బీజేపీ, మరో కన్ను కాంగ్రెస్‌ అని వైయస్‌ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు రహిమాన్‌ విమర్శించారు. విశౠఖలో నిర్వహించిన మైనారిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు తెలుగు, ఇంగ్లీష్‌ సరిగా రాదని, ఉర్దూ అసలే రాదన్నారు. చంద్రబాబుకు ఈద్‌ కూడా తెలియదని, ఊద్‌ ముబారక్‌ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ఒక కన్ను బీజేపీ, మరో కన్ను కాంగ్రెస్‌ అని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ పులి బిడ్డ అని అభివర్ణించారు. చంద్రబాబు తన కేబినెట్‌లో ఇంతవరకు ముస్లింలకు ప్రాతినిధ్యం లేదన్నారు. మనకు  ఒకే ఒక మార్గం ఉందని, మనకు మంచి జరగాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్క చంద్రబాబు కాదు..వంద మంది బాబులు వచ్చినా వైయస్‌ జగన్‌ను సీఎం కాకుండా ఆపలేరన్నారు. మనకు రిజర్వేషన్లు ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డే అన్నారు. ఆరు నూరు అయినా, నూరు ఆరు అయినా వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు. దమ్ముంటే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల మాదిరిగా పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి మహానేత రుణం తీర్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
 
Back to Top