ప్రతిపక్ష నేత మైక్ కట్...సభలో సభ్యుల నిరసన

ఏపీ అసెంబ్లీ: ఆక్వా ఫుడ్‌ పార్క్‌ ఘటనపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్షానికి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆక్వా ఘటనపై ప్రభుత్వ తీరును ఎండగడుతుండగా మైక్‌ కట్‌ చేసి ముఖ్యమంత్రి, మంత్రులు వ్యక్తిగత దూషణకు దిగడంతో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆక్వా బాధితులకు న్యాయం చేయాలని  నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Back to Top