దుగ్గిరాల ఎంపీపీ ఉపాధ్యక్షుడిగా వైయ‌స్‌ఆర్ సీపీ సభ్యుడు

గుంటూరు: తెలుగు దేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్ర‌లు కుతంత్రాలు చేసినా చివ‌రకు న్యాయమే గెలిచింది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం దుర్గిరాల మండ‌ల ప‌రిష‌త్ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కైవ‌సం చేసుకుంది. ఎంపీపీ ఉపాధ్యక్ష ఎన్నికల్లో టీడీపీకి బలం లేదన్న విషయం తెలిసినా ఆ పదవిని లాక్కోవాలనే దుర్బుద్ధితో అధికారులు, పోలీసుల సాయంతో ఆ పార్టీ నేతలు దాష్టీకాలకు దిగారు. అయితే 18మంది సభ్యుల్లో 11మంది వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి మ‌త్తె ఆనంద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఆనంద్ దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. కాగా వైయ‌స్‌ఆర్ సీపీ సభ్యులతో కోరం సరిపోయినా ఎన్నికను వాయిదా పడేలా చేసిన విషయం తెలిసిందే.

Back to Top