విశాఖలో నేడు వైయ‌స్ఆర్‌సీపీ సమావేశం


విశాఖ‌:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ‘వంచన దినం’ కార్యక్రమంపై చర్చించేందుకు మంగళవారం విశాఖపట్నంలో పార్టీ నేతల సమావేశం జరగనుంది. విశాఖ, మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు హాజరు కావాలని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో విజ్ఞప్తి చేసింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్‌ వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.  

Back to Top