సెప్టెంబర్‌ 1న వైయస్సార్సీపీ సమావేశం

ఆస్పరి: నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో బూత్‌లెవల్‌ సమావేశాన్ని సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైయస్సార్సీపీ మండల కన్వీనర్‌ దొరబాబు తెలిపారు. ఆస్పరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈసమావేశానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హజరవుతారన్నారు. ఎమ్మెల్యే కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తారన్నారు. సమావేశానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు హజరు కావాలని ఆయన కోరారు.

Back to Top