వైఎస్ జగన్ పర్యటనకు సన్నాహాలువిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్
జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరపనున్న పర్యటన కోసం పార్టీ శ్రేణులు, నాయకులు
సన్నాహాలు చేస్తున్నారు.  పర్యటన విజయవంతం
చేయాలని కోరుతూ ఆదివారం కశింకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి
నియోజకవర్గ కార్యాకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ జిల్లా ప్రతినిథి మల్ల బుల్లిబాబు, అనకాపల్లి టౌన్ కన్వీనర్ జానకి రామరాజు, అనకాపల్లి కశీంకోటమండల కన్వీనర్లు గొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితరులు
పాల్గొన్నారు.

 

Back to Top