నేడు వైయస్సార్‌ సీపీ మండల సమావేశం

మామిడికుదురు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ సమావేశం బుధవారం ఉదయం పది గంటలకు పాశర్లపూడి గ్రామ పరిధిలోని శ్రీపాశర్లపూడి సత్రం వద్ద జరుగుతుందని పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని 11 గ్రామాలకు చెందిన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, బూత్‌ కమిటీ అధ్యక్షులు, బూత్‌ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. 

Back to Top