టీడీపీ భూదందాపై ఈనెల 22న మహాధర్నా

  • పాల్గొననున్న ప్రతిపక్షత నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • భూస్కాంల వెనుక బాబు హస్తం ఉంది
  • ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకే మా పోరాటం
  • చంద్రబాబు 12 ఏళ్ల పాలనంతా అవినీతిమయమే
  • మీ మిత్రపక్షనేత, మీ మంత్రి సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్‌ చేస్తుంటే సిగ్గులేదా బాబూ
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగే భూ కుంభకోణాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. భారతదేశంలో జరుగుతున్న అవినీతిపై ఒక పుస్తకం రాయాల్సివస్తే అందులో 80 శాతం పేజీలు చంద్రబాబువే ఉంటాయని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం హస్తం కూడా ఈ ల్యాండ్‌ స్కాంలో ఉందని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైందన్నారు. విశాఖ భూ ఆక్రమణలపై జిల్లా పార్టీ కార్యాలయంలో అమర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. టీడీపీ భూ దందాలపై గత కొద్ది రోజుల క్రితం విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అఖిలపక్ష నేతలతో కలిసి మధుపాకలో కూడా పర్యటించడం జరిగిందని గుర్తు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 22వ తేదీన విశాఖ కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్ ప్రకటించారు. ఈ మహాధర్నాకు వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని స్పష్టం చేశారు. మహాధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతారన్నారు. అదే విధంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు, రైతులకు వైయస్‌ జగన్‌ అండగా నిలుస్తారన్నారు. 

లేఖల ద్వారా పక్కదారి పట్టించాలనే కుట్ర
గత ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీ విశాఖ భూ కుంభకోణాలపై పోరాటాలు చేస్తున్నాం... ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లుగా కూడా లేదని గుడివాడ అమర్‌నా«ద్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి దగ్గరుండి భూదందాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి, సంక్షేమం అనే పదాలను మర్చిపోయి పరిపాలన చేస్తున్నాడన్నారు. టీడీపీ క్యాబినెట్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు భూ ఆక్రమణల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రకటించడం జరిగిందన్నారు. అయ్యన్నపాత్రుడు ఎవరి పేరు ప్రస్తావించముందే మంత్రి గంటా ఎందుకు సీఎంకు లేఖ రాశారని ప్రశ్నించారు. లెటర్‌లు ఇచ్చి భూ స్కాంలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూదాందాపై సీబీఐ విచారణ జరపాల్సిందే...
గతంతో కలుపుకొని చంద్రబాబు 12 ఏళ్ల పాలన మొత్తం అవినీతి మయమేనని అమర్‌ విమర్శించారు. ఏలేరు స్కాం నుంచి నేడు విశాఖ భూ స్కాంల వరకు ప్రధాన హస్తం బాబుదేనని ఆరోపించారు. పట్టిసీమ, రాజధాని భూములు, విశాఖ ల్యాండ్‌ పూలింగ్, పుష్కరాలు, దస్‌పల్లా హిల్స్‌ ఇలా అన్నిట్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. భూ స్కాంలపై మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, మీ క్యాబినెట్‌ మంత్రి సీబీఐ విచారణ వేయాలని డిమాండ్‌ చేసినా సీఎంకు సిగ్గులేదా అని ధ్వజమెత్తారు. ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే సిట్‌ అనే కమిటీని వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. వేల ఎకరాల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అదే విధంగా దస్‌పల్లా హిల్స్‌ భూ కుంభకోణంపై కూడా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి ఆ ప్రాంతంలో పర్యటించే విధంగా చేస్తామన్నారు. 
Back to Top