రేపు అనంత‌లో మ‌హాధ‌ర్నా

అనంత‌పురంః రైతుల‌కు రుణ‌మాఫీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంత‌పురం జిల్లా చెన్నేకొత్త‌ప‌ల్లిలో శ‌నివారం మ‌హాధ‌ర్నాను నిర్వ‌హించ‌నున్నారు. చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పేలా మ‌హాధ‌ర్నాకు రైతులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరావాల‌ని కోరారు. రుణ‌మాఫీ చేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ స‌ర్కార్ రైతుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు.

Back to Top