26న వైయస్‌ఆర్‌ సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల 23వ జరగాల్సిన  వైయస్‌ఆర్‌ సీఎల్పీ సమావేశం అక్టోబర్ 26కు వాయిదా పడింది. గురువారం సమావేశం ఉంటుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. గురువారం  ఉ.10:30 గం.ల‌కు రావి నారాయ‌ణ రెడ్డి ఫంక్ష‌న్ హాల్‌ లో ఈ సమావేశం జరుగుతుంది.  ఈ స‌మావేశానికి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర అధికార ప్ర‌తినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్య‌క్షులు, అన్ని జిల్లాల‌కు చెందిన జిల్లా పార్టీ ప‌రిశీల‌కులు, జిల్లా పార్టీ అధ్య‌క్షులు, పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న‌ మండ‌లి స‌భ్యులు, శాస‌న స‌భ్యులు, పార్ల‌మెంటు మరియు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు హాజరవుతారు. పాద‌యాత్ర జ‌రుగుతున్న జిల్లాలో కాకుండా, ఇత‌ర జిల్లాల్లో చేప‌ట్ట‌వ‌ల‌సిన‌ పార్టీ కార్యాచ‌ర‌ణ కొర‌కు నాయకులు ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల ఆధారంగా రాబోయే 6 నెల‌ల పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డం జ‌రిగింది. 26వ తేదీన జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశంలో అధ్య‌క్షుల‌ు పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను నిర్దేశిస్తారు. Back to Top