విజయవాడ సీపీని కలిసిన వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడ సీపీని వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు అడగకుండానే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమీడియన్‌ బండ్ల గణేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. తక్షణమే రాష్ట్రంలో జరిగే దాడులను అరికట్టాలని, అదే విధంగా బండ్ల గణేష్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Back to Top