తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారు

 చిత్తూరు: తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలకు బాబు కేరాఫ్‌గా మారారని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర భరోసా ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నిన్న తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని మాట్లాడటం బాధాకరమన్నారు. ఇ లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు తెలుగు ప్రజలంతా తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. గతంలో కూడా నేనే వేసిన రోడ్లపై నడుస్తున్నారని, నేను కట్టిన ఇంట్లో ఉంటున్నారని మాట్లాడారని గుర్తు చేశారు. వివాదస్పద వ్యాఖ్యలకు చంద్రబాబు కేరాఫ్‌గా నిలుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదన్నారు. ప్రజల సొత్తుతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారన్నారు.
 
Back to Top