ఉక్కు ఫ్యాక్టరీ సాధించేదాక పోరు ఆగదు

నేటి నుంచి రోజువారీగా ఆందోళనలు
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు, కడప మేయర్‌ సురేష్‌బాబు ధ్వజమెత్తారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప వైయస్‌ఆర్‌ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. పరిశ్రమ సాధన కోసం నేటి నుంచి రోజు వారిగా ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, విభజన  హామీల కోసం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశారన్నారు. పార్లమెంట్‌ ఆఖరి బడ్జెట్‌ సమావేశాల్లో కలిసి పోరాడుదామని టీడీపీకి చెప్పినా పట్టించుకోలేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రథమ ముద్దాయి చంద్రబాబు అని విమర్శించారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసం లక్షల కోట్లు దండుకున్నారు కానీ.. ఏ రోజు చంద్రబాబు గానీ.. టీడీపీ ఎంపీలు గానీ ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలను అడిగిన పాపాన పోలేదన్నారు. సీఎం రమేష్‌ నాలుగేళ్లుగా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించలేదన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసం చంద్రబాబు, బీజేపీతో సఖ్యతత ఉన్నాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సీఎం రమేష్‌ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top