తిరుపతి: నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తీవ్ర అస్వస్థతకు గురై తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, రోజాపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టాలని పోలీసులపై టీడీపీ నాయకుల వత్తిడి చేయడంపై రోజా పుత్తూరులో శనివారం ధర్నా చే శారు. సీఐ సాయినాథ్ దురుసు ప్రవర్తనపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆందోళన చేశారు. ఈనేపథ్యంలో తీవ్ర మండుటెండలో నిరసన చేస్తున్న రోజాకు షుగర్ లెవల్స్ పడిపోవడం, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది.<br/>దీంతో ఆమెను ముందుగా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈనేపథ్యంలో స్విమ్స్ క్యాజువాలిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్ నేతృత్వంలో రోజాకు వైద్య సేవలు అందించారు.<br/>పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న రోజాను పరామర్శించారు.