నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి

కోవూరు:
వర్షప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు విస్తృతంగా
పర్యటిస్తున్నారు. ఐదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో  నెల్లూరు
జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్సీపీ నాయకులు కోవూరులో
దెబ్బతిన్న పంటలు పరిశీలించి, రైతులను పరామర్శించారు. అదేవిధంగాఎనమడుగు
గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న 300 ఎకరాల తమలపాకు తోటను పరిశీలించారు. 

వర్షాల
వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని
కోరారు. ఈ పర్యటనలో వైెస్సార్సీపీ  ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్
రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.    

తాజా ఫోటోలు

Back to Top