గుర్రం జాషువాకి ఘన నివాళి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో గుర్రం జాషువా 122వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున, నేతలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఆంజనేయులు, కావటి మనోహర్‌నాయుడు పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

బాబుకు దళితులంటే చిన్నచూపు
ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని మేరుగు నాగార్జున విమర్శించారు. జిల్లాలో జరిగే గుర్రం జాషువా జయంతి వేడుకలకు ఎందుకు హాజరు కాలేకపోయారని ప్రశ్నించారు. అర్ధాంతరంగా ఆగిపోవడానికి గల కారణం ఏంటని నిలదీశారు. జాషువా జయంతిని ప్రభుత్వం తరుపున నామ మాత్రపు వేడుకలతోనే సరిపెట్టారని మండిపడ్డారు. ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 
Back to Top