జ‌గ్జీవ‌న్‌రామ్‌కు ఘ‌న నివాళి

శ్రీ‌కాకుళం(జంగారెడ్డిగూడెం):  భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ 110 వ జ‌యంతి వేడుక‌లు  జంగారెడ్డిగూడెం ఐదో వార్డు లో ఘనంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు , కూనపాముల పండు, చింతపల్లి ఏసురాజు , ఉప్పాటి రాఘవులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జ‌రిగాయి. జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, నాయకులు మండవల్లి సోంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు, నాయకులు చనమాల శ్రీనువాస్, పాశం రామకృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, పాములపర్తి శ్రీనివాస్, ముప్పిడి అంజి, బీవీఆర్‌ చౌదరి, పి, నారాయణరాజు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కేతవరంలో ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి వైయస్ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్టీ నాయకులు నరెడ్ల బుజ్జిబాబు, పెదమళ్ల బండియ్య, మాజీ సర్పంచ్‌ తిరుమలశెట్టి సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.

Back to Top