మైనార్టీ నేత మృతికి సంతాపం

ఉరవకొండ పట్టణానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం మండల ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బాషా(46) మంగళవారం రాత్రి వడదెబ్బకు గురై మృతి చెందాడు. పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేస్తు మైనార్టీల సమస్యలపై ఖాదర్‌బాషా ఎన్నో ఆందోళనలు చేపట్టారు. మృతునికి భార్య వాహిదా, ఇద్దురు కొడుకులు వున్నారు. ఖాదర్‌బాషా మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలోని ఖాదర్‌బాషా స్వగృహనికి చేరుకొని మృతుదేహం వద్ద సంతాపం తెలిపారు. అనంతరం స్ధానిక తహసీల్దార్, వైద్యలతో మాట్లాడి వడదెబ్బ సోకి మృతి చెందిన ఖాదర్‌బాషా కు సహయం అందేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్సీ విప్‌ వై.శివరామిరెడ్డి ఫోన్‌లో మృతుని కుటుంబ సభ్యలకు సంతాపం తెలిపి రూ 10వేల ఆర్థిక సహయాన్ని కార్యకర్తల ద్వారా అందించారు. దీంతో పాటు యువనేత భీమిరెడ్డి కూడా కుటుంబ సభ్యలను ఫోన్‌లో ఓదార్చారు. సంతాపం తెలిపిన వారిలో మైనార్టీ విభాగం జిల్లా కమీటి సభ్యలు హుసేన్‌అహ్మద్, జిలాన్, మండల నాయకులు నిజాం, శర్మాస్, డ్రవర్‌ కాలనీ జిలాన్, పామిడి సలీం, జడ్‌పీటీసీ సభ్యలు తిప్పయ్య, ఎస్‌సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, వైఎస్‌ఆర్‌ విద్యార్థి విభాగ్‌ జిల్లా కార్యదర్శి జిలాన్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు వున్నారు.

తాజా వీడియోలు

Back to Top