సోమ‌యాజులు మృతికి ప‌లువురు సంతాపం

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు  మృతి పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప‌లువురు సంతాపం తెలిపారు. ఆదివారం తెల్ల‌వారుజామున సోమ‌యాజులు క‌న్నుమూశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని మోహ‌దీప‌ట్నంలో ఉన్న ఆయ‌న నివాసానికి ప‌లువురు పార్టీ నాయ‌కులు చేరుకొని సోమ‌యాజులు పార్థీవ‌దేహానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని   హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు.  
Back to Top