బాధితురాలికి బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ

కరీంనగర్ : చల్లూరులో గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలి ఉన్నత చదులకయ్యే ఖర్చు అంతా  వైఎస్సార్సీపీ భరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.  వీణవంకలో బాధితురాలిని పరామర్శించి మనో ధైర్యాన్నిచ్చారు. ఆమె న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top