అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

తూర్పుగోదావరి: అగ్నిప్రమాదం జరిగి రోడ్డున పడ్డ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. తాళ్లరేపు మండలం పోలేకు్రరలో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి నిత్యవసర సరుకులను, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గుత్తుల సాయి, మణి, గోవింద్, దుర్గమ్మ, బుచ్చిబాబు, జగదీశ్‌లు ఉన్నారు. 

Back to Top