విభజన హామీలు సాధించడం వైయస్‌ జగన్‌కే సాధ్యం


వైయస్‌ఆర్‌ జిల్లా: విభజన హామీలు సాధించడం వైయస్‌ జగన్‌కే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్‌ తీసుకున్నారన్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నారని, ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే వైయస్‌ జగన్‌ పోరాట ఫలితమే అన్నారు. విభజన హామీలు సాధించడం వైయస్‌ జగన్‌కే సాధ్యమన్నారు. 
 
Back to Top