ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి..?

తిరుపతి:
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతిలో
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్ రెడ్డిపై కేసు
పెట్టారని విమర్శించారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని
వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్
రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.
Back to Top