ఎమ్మెల్యే ఆర్కేపై అక్రమకేసులు పెట్టడం అమానుషం

తుళ్లూరు: వైయస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై అక్రమ కేసులు బనాయించడాన్ని పార్టీ మండల నాయకులు ఖండించారు. ఈ మేరకు పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల కిషోర్‌ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. సీఆర్‌డీఏ అడ్డగోలుగా, రైతుల అభిష్టానికి విరుద్ధంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని అందుకు రైతులకు అండగా ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి మాట్లాడారని చెప్పారు. ఆయనపై అక్రమంగా కేసులు పెట్టడం తగదన్నారు. రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టం ఉన్న రైతులనుంచి ప్రభుత్వం భూములు తీసుకుందని.. ఇష్టం లేని రైతులను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదల వీడి సమీకరించిన సుమారు 54 వేల ఎకరాలను అభివృద్ధి పరచాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు బుర్రావెంకటశివారెడ్డి, మండల యువజన నాయకులు నందిగం సురేష్, జిల్లా నాయకులు కొప్పుల శేషగిరిరావు, మండల ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు బెజ్జం రాంబాబు, జిల్లా ప్రచార కమిటీ నాయకులు అక్కల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు కొమ్మినేని కృష్ణారావు, చనుమోలు రామారావు, పువ్వాడ లలిత్‌ తదితరుల పాల్గొన్నారు.

Back to Top