గతం మర్చిపోయి వ్యాఖ్యలు చేయొద్దు

కంకిపాడుః  గతం మర్చిపోయి వైయస్సార్‌సీపీపై అవాకులు, చెవాకులు పేలొద్దని వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య టీడీపీ నేతలకు సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాంచారయ్య మాట్లాడుతూ నంద్యాల ఓటమిని పార్టీ హుందాగా స్వీకరిస్తే టీడీపీ నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా నంద్యాలలో 70 వేల మంది ఓటర్లు వైయస్సార్‌సీపీకి అండగా నిలిచారన్నారు. టీడీపీకి దమ్ముంటే వైయస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన 20 ఎమ్మెల్యే స్థానాలకూ ఒకే సారి ఎన్నికలకు రావాలని సవాల్‌ చేశారు. గతంలో టీడీపీ పోటీ చేసిన పలుచోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ పుట్టాక 15 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉందని గుర్తు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా 2019లో వైయస్సార్‌సీపీదే విజయమని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మేదండ్రావు కుటుంబరావు, వంకదారు

Back to Top