వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో అంద‌రికీ భ‌రోసా




తూర్పు గోదావ‌రి:   వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దగాపడ్డ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు మనో బలాన్నిచ్చింద‌ని, అంద‌రిలో భ‌రోసా క‌ల్పిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా నాయ‌కులు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, బీవై రామ‌య్య పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 200వ రోజులకు చేరుకున్న సంద‌ర్భంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌ను వారు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే బీసీల అధ్యయనానికి ఓ కమిటీ వేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉచితంగా ఇస్తానని ప్రకటించార‌ని చెప్పారు. పేద రైతులకు భూపంపిణీతో పాటు ఉచితంగా బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ విధంగా ప్రయోజనం కలిగిందో అంతకన్నా రెండడుగులు ముందుకేసి వైయ‌స్ జ‌గ‌న్ అండగా ఉంటార‌ని చెప్పారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్, చట్ట సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన‌ట్లు తెలిపారు. వైయ‌స్  జగన్‌ భరోసా దళితుల్లో ఆశాకాంతులు నింపింద‌ని చెప్పారు. ఆసరాలేని అవ్వాతాతలకు బతుకు తీపి పంచింద‌ని వివ‌రించారు. యువత, నిరుద్యోగుల్లో కొత్త భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించిందని చెప్పారు. చదువుకునే విద్యార్థుల్లో మనోధైర్యం తీసుకొచ్చింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది. గుండె చెదిరిన ప్రతి వ్యక్తికీ భవిష్యత్‌ బాగుంటుందనే నమ్మకం కలిగించింద‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ క‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పారు. 
Back to Top