వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వ‌ర్యంలో చ‌లివేంద్రం ఏర్పాటు

బుచ్చినాయుడుకండ్రిగ; మండల కేంద్రమైన బుచ్చినాయుడు కండ్రిగలోని బస్టాండు స‌మీపంలోని పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు కారణి హరిబాబు మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి కోసం ప్ర‌జ‌లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే చలివేంద్రాలు ఏర్పాటు అవసరమన్నారు. ఇందుకోసం వైయ‌స్సార్ సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల వైయ‌స్సార్ సీపీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, రమణయ్య, రామయ్య, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top