వైయస్సార్సీపీ శ్రేణుల రాస్తారోకో

గుంటూరుః మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ.... గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద గుంటూరు-వినుకొండ రహదారిపై  వైయస్సార్సీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

Back to Top