కర్నూలు: టీడీపీ నేతల ప్రోద్భలంతోనే కేసులు బనాయిస్తున్నారని పార్టీ నాయకులు బీవై రామయ్య, శ్రీదేవి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం సోమవారం కర్నూలు ఎస్పీ గోపినాథ్‌ని కలిశారు. నాటు బాంబుల ఘటనలో తన భర్తను అక్రమంగా ఇరికించారని బాధితుడు అనంతరెడ్డి సతీమణి రాజేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీలో కీలకంగా పని చేస్తున్నందుకే కుట్ర చేశారని ఆరోపించారు. పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదని ఎస్పీకి వివరించారు.