ఆ అడుగు వెనుకవచ్చువారికి బాట అయినది

విశాఖ: మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే.. వెనుక వచ్చు వారికి ఆ అడుగు బాట అయినది అన్న చందంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని, పార్టీ యువజన నాయకులు అన్నారు. విశాఖ జిల్లా హుకుంపేటలో ప్రత్యేక హోదాకు మద్దతుగా వైయస్‌ఆర్‌ సీపీ యువజన నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ.. ప్రజా నాయకుడు వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం తొలి అడుగు వేశారని, ఇప్పుడు ఉద్యమం చివరి దశకు వచ్చే సరికి పవన్‌కల్యాణ్, చంద్రబాబు వచ్చి చేరి మేమే అంతా అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. హోదా సాధనకు సహకారం అందించకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారన్నారు. లోక్‌సభలో ఐదు మంది ఎంపీలున్నా.. వైయస్‌ జగన్‌ దాదాపు 250 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారన్నారు. టీడీపీ ఎంపీలు పాకిస్తాన్‌ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబు అవినీతి గురించి పవన్‌ కల్యాణ్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. హోదా కోసం విద్యార్థులంతా ముందుంజలో ఉన్నారని, వైయస్‌ జగన్‌ సారథ్యంలోనే హోదా వస్తుందని ఆకాంక్షించారు. 
Back to Top