మూడేళ్లలో ఒక్కఇళైనా ప్ర‌భుత్వం పూర్తి చేసిందా?

ఆత్మకూరుః టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క ప్రభుత్వ ఇళ్లు కూడా పూర్తి చేయలేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమర్శించారు. గురువారం స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైయ‌స్ఆర్ సీపీ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇళ్లులేని పేద‌వారికి ఇళ్లు మంజూరు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర‌రెడ్డిద‌ని గుర్తు చేశారు. కాని టీడీపీ హాయాంలో ఇళ్ల కోసం తెలుగు తముళ్లే క్యూలు కడుతున్నారని తెలియచేశారు. అంతేకాకుండా  వైఎస్ఆర్‌ హయాంలో ఇన్‌పుట్ సబ్సీడి ప్రతీ ఒక్కరికి అందిందన్నారు. కాని ఈ ఏడాది ఖరీఫ్‌పంటకు సంబంధించి ఇన్‌పుట్‌సబ్సీడి జాబితానే అధికారులు విడుదల చేయలేదన్నారు. మండలంలో తీవ్ర తాగు నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిథులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బంధూక మధు, మండల రైతుసంఘం నాయకుడు ఆవుల ఈశ్వరరెడ్డి , మండల ఉపాధ్యక్షుడు పెదయ్య, కార్యకర్తలు దామోదర్, ఎగువపల్లి శీన, రామన్న, చిట్టెప్ప, శ్రీరాములు పాల్గొన్నారు.
Back to Top