వైయస్‌ఆర్‌సీపీ వర్గీయులపై అఖిల ప్రియ బంధువుల‌ దాడి


కర్నూలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మంత్రి అఖిల ప్రియ బంధువులు వైయస్‌ఆర్‌సీపీ వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ పేరుతో పిలిపించి క్రరలు, కత్తులతో టీడీపీ కార్యకర్తలు మూక్కుమ్మడి దాడి చేశారు. దొర్నిపాడు మండలం, కొత్తపల్లికి చెందిన భూమా బ్రహ్మం, కుమారులు సహా మరో 20 మంది దాడి చేశారంటూ కేఈ శ్రీనివాసగౌడ్, సోదరులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో శ్రీనివాసగౌడ్‌ ఆసుపత్రికి చేరారు. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
Back to Top