వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

తిరుపతిః వైఎస్సార్సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని భూమన ప్రారంభించారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండలు తీవ్రతరం కావడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారని...వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని భూమన అన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 
Back to Top