బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని..

ఏలూరు:  కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఏలూరులో పార్టీ నాయకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతు తెలిపేలా, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. చంద్రబాబు తీరు కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కోసమే టీడీపీ మంత్రులు రాజీనామా చేశారని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ రోజు ఎందుకు ఎన్‌డీఏ నుంచి వైదోలగలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు నాల్కల దోరణీతో ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారని మండిపడ్డారు.  వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ప్రత్యేక హోదా వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Back to Top