తాగునీటి సమస్యలపై నిరసన

హిందూపురంః ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌క‌న్నా సినిమాలే ఎక్కువ‌య్యాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త న‌వీన్ మిశ్చ‌ల్ మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీటి కోసం ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నా నిర్వ‌హించారు. బాల‌కృష్ణ‌కు వ్య‌తిరేకంగా దున్న‌పోతుపై నినాదాలు రాసి నిర‌స‌న‌ వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా న‌వీన్ మిశ్చ‌ల్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా ఉంటూ  బాలకృష్ణ గ‌త 5 నెల‌లుగా హిందూపురం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి సినిమాలు చేసుకుంటూ డ‌బ్బులు వెన‌కేసుకుంటున్నాడ‌ని విమ‌ర్శించారు. బాల‌కృష్ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాపై పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ర్యాలీని అడ్డుకొని ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై లాఠీచార్జ్ చేశారు.

Back to Top