మరిడిమాంబను దర్శించుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు

విశాఖ: పరవాడ మండలంలో రావాడ శివారు బొట్టవానిపాలెం గ్రామంలో కొలువుదీరిన మరిడిమాంబ అమ్మవారిని పెందుర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మండల పార్టీ అధ్యక్షుడు పైల అప్పలనాయుడు (జూనియర్‌), నాయకులు పెదిశెట్టి శేఖర్, పైల హరీష్, పల్లా గోవింద్, కావలి వాసు, డి.సంజీవరావు, కె.పూర్ణ, కె.నానిబాబు, పవన్,రాజు, బద్రీ  దర్శించుకున్నారు. అనంతరం భారీ బాణ సంచా కాల్పుల మధ్య అమ్మవారి అనుపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాత్రికి ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Back to Top