రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాల‌న‌

 

విజయవాడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను, లక్ష్యాలను చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ కార్యాలయంలో నిర్వహించారు. అలాగే విజయవాడలోని పోలీసు క్వార్టర్స్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న అవినీతి డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top