క‌దంతొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

విశాఖ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయ‌క‌రావుపేట‌ నియోజకవర్గ ప్లీనరీకి పార్టీ శ్రేణులు క‌దం తొక్కారు. మాజీ ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌  సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ సెల్‌ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు సారధ్యంలో నిర్వ‌హించిన ప్లీన‌రరీలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉప్పెనలా కదిలారు. అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు మండల కేంద్రానికి చేరగా తొలుత మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా సూర్య‌నారాయ‌ణ‌రాజు మాట్లాడుతూ స్వచ్చంధంగా ఇంత భారీ స్థాయిలో వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంత తొందరగా చూస్తామా అని తహతహలాడుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ రామచంద్రరాజు, యువనాయకులు ఆర్‌.ఎస్‌.నారాయణమూర్తిరాజు, నాయకులు ఆర్‌.ఎస్‌.సీతారామరాజు, ఆర్‌.ఎస్‌.సత్యనారాయణరాజు, ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ, జడ్పీటీసీ వంతరవెంకటలక్ష్మి, మండల కన్వీనర్‌ పైల రమేష్, ఎంపీటీసీలు గంటేడ పాప, జి.వి.రమణమూర్తి, సర్పంచులు టి.నారాయణరావు, ఆర్‌.వెంకట్రావు, ఆర్‌.వెంకటరమణ, మాజీ ఎంపీపీ కిల్లాడ సాయి, నాయకులు కిల్లాడ శ్రీను, పెట్ల వెంకట రమణ, పెట్ల రాంబాబు, పైల అప్పల సత్యనారాయణ, శెట్టి రమణ, విజయ్‌కుమార్, ఎస్‌.వి.రమణమూర్తి, గొల్లు చిట్టిబాబు, అవుగడ్డి శ్రీనివాసరావు, కె.వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top