కుంభాభిషేకం పూజ‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

చిత్తూరు:  జిల్లాలోని పుత్తూరు శివాలయంలో జరిగిన కుంభాబిషేకం పూజ‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు. గురువారం జ‌రిగిన ఆల‌య వేడుక‌ల్లో మాజీ మంత్రి ,పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి, ఎమ్మెల్యే ఆర్కే రోజా దంప‌తులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. వీరికి ఆల‌య క‌మిటీ స‌భ్యులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. పూజ‌ల అనంత‌రం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌కు పురోహితులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.


Back to Top