హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది

హైదరాబాద్‌: సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్‌ సభ్యులు నందమూరి హరికృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు అన్నారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో భౌతికకాయానికి వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ మేర‌కు వైవీ, మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా నాయకుడు, గొప్ప మనసున్న వ్యక్తి హరికృష్ణ అన్నారు. ఎత్తుగడలు తెలియవు.. ఏ విషయానైనా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం హరికృష్ణ సొంతమన్నారు. 61 సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. హరి కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అదే విధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
Back to Top