14, 15 తేదీల్లో పాదయాత్రలు



- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర మే 14వ తేదీకి 2 వేల కిలోమీట‌ర్లు
- జ‌న‌నేత‌కు సంఘీభావంగా పాద‌యాత్ర‌లు
- ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా ఖండిస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు
- 16న క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేత‌

హైదరాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ఈనెల 14వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలని పార్టీ ఒక కార్యాచరణను రూపొందించింది. 2 వేల కిలోమీట‌ర్లు పూర్తి అయిన సంద‌ర్భంగా పండుగ‌లా చేసుకుందామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చారు. అలాగే నాలుగేళ్ల చంద్ర‌బాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీలను నెరవేర్చని వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని పార్టీ పిలుపు నిచ్చింది.

 హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల జగన్‌కు గల సంకల్పాన్ని , ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టబోయే పథకాలను  ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియ జేయాలని పార్టీ కోరింది. రెండు రోజుల పాదయాత్ర ముగిసిన తరువాత మరుసటి రోజైన 16వ తేదీన 13 జిల్లాల్లో కలెక్టర్‌లకు పార్టీ తరపున వినతి పత్రాలను సమర్పించాలని కోరింది. ఆ తరువాత పార్టీ నేతలు, శ్రేణులు కలెక్టర్‌ కార్యాలయాల వద్ద బహిరంగ సభలు నిర్వస్తారు. జగన్‌ 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అదే విధంగా ఎన్నికల హామీలను నెరవేర్చని వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరింది. 

పాదయాత్రలో నల్లజెండాలు ఉండాలి
రెండు రోజుల పాదయాత్రలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పాదయాత్ర చేస్తూ చంద్రబాబు వైఫల్యాలను తెలియజేసే కరపత్రాలను పంచాలి. కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగే బహిరంగ సభల్లో నల్లరంగు బ్యాండ్‌లను చేతికి ధరించాలని కూడా పార్టీ సూచించింది. అన్ని మండలాలను కలుపుతూ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను విధిగా రూపొందించుకోవాలని కూడా పార్టీ పేర్కొంది. పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాదయాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.    

Back to Top