గురజాల: గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గురజాల మండలంలోని 14 గ్రామాల నుంచి వేలాది మంది వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుంచి అంచనాకు మించి ప్రజలు తరలివెళ్లారు. జంగమహేశ్వరపురం నుంచి మాజీ ఎంపీపీ వి. అమరారెడ్డి, ఎ.సైదారెడ్డి, పోలు వీరారెడ్డి ఆధ్వర్యంలో, చర్లగుడిపాడు మాజీ సర్పంచ్ వేముల చలమయ్య, మాడుగుల నుంచి ఇవాంజికల్ బాబు, అంబాపురం నుంచి గంగిరెడ్డి రామకోటమ్మ, ఆరికట్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, పులిపాడు నుంచి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, గంగవరం నుంచి పూజల చంటి, పల్లెగుంత నుంచి వంకాలయపాటి మల్లయ్య, దైద నుంచి గుండెబోయిన సోమయ్య, సాంబశివరావు, తేలుకుట్ల నుంచి గాడిపర్తి వెంకటేశ్వర్లు, నాగార్జున రెడ్డి ఆధ్యర్యంలో గొట్టిముక్కల నుంచి సింగం నాగరాజు ఆధ్వర్యంలో గోగులపాడు ముత్తన బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఆధ్యర్యంలో, బూదవాడ నుంచి సాంబయ్య, అంజనాపురం నుంచి మేకల శేషిరెడ్డి ఆధ్యర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు.