జిల్లా ప్లీనరీకి తరలిన వైయస్సార్‌ సీపీ శ్రేణులు

పిట్టలవానిపాలెం ః ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా,ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విదానాలు ఎండగట్టేందుకు జిల్లా స్థాయిలో శుక్రవారం జరిగిన వైయస్సార్‌ సీపీ ప్లీనరీ సమావేశానికి పిట్టలవానిపాలెం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు షేక్‌బాజి,జడ్‌పీటీసీ సభ్యులు చిరసాని నారపరెడ్డిల ఆధ్వర్యంలో బారీగా పార్టీ నాయకులు,కార్యకర్తలు తరలి వెళ్ళారు.మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో రెడ్డిపాలెం సెంటర్‌కు చేరుకున్నారు. రెడ్డిపాలెం సెంటర్‌ నుంచి ర్యాలీగా వెళ్ళిన నాయకులు,కార్యకర్తలు సంగుపాలెం గ్రామంలోని మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు.అనంతరం వివిధ వాహనాల్లో గుంటూరుకు వెళ్ళారు.ఈకార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి అహ్మద్‌ హుస్సేన్,రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి మండేవిజయ్‌కుమార్,బడుగు ప్రకాశరావు,బీసీసెల్‌మండల కన్వీనర్‌ నర్రా శ్రీనివాసరావు,సంగుపాలెం సర్పంచ్‌ రెబ్బగుంట శివశంకర్,జిల్లా అధికార ప్రతినిధి ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి,యువజనవిబాగం మండలకన్వీనర్‌ వి శివారెడ్డి,నాయుకులు దొంతిరెడ్డి కోటిరెడ్డి,అశోక్,సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Back to Top