రామకృష్ణారెడ్డిని కలిసిన వైయస్సార్‌సీపీ నేతలు

దాచేపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ నేతలు కలిశారు. హైదరాబాద్‌ నుంచి పిడుగురాళ్ల వెళ్లుతూ మార్గమధ్యలోని దాచేపల్లిలో శనివారం ఆయన ఆగారు. పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్‌ మునగా పున్నారావు, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావులు రామకృష్ణారెడ్డిని కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు పోలీసులతో పెట్టిస్తున్న తప్పుడు కేసులు గురించి, అరాచకాల గురించి ఆయనకు చెప్పారు. అధైర్యపడాల్సిన అవసరంలేదని, మనోధైర్యతో ఉంటూ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయటమే లక్ష్యంగా పనిచేయాలని రామకృష్ణారెడ్డి సూచించారు. రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో పార్టీ నాయకులు కొప్పుల అప్పారావు, వేముల శ్రీహరి, సైదా, చిమాట రమణ తదితరులున్నారు.

Back to Top