ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైయస్సార్సీపీ నేతలు

హైదరాబాద్: వైయస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు. కనగానెపల్లె ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ నేత చల్లా మధుసూదన్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి రాసిన లేఖను మధుసూదన్ రెడ్డి ఈసీకి అందజేశారు.

ఎన్నికల సమయంలోని వీడియో ఫుటేజీని పరిశీలించి ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని వైయస్ఆర్సీపీ నేతలు ఈసీని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టర్ను ఈసీ ఆదేశించారు. 
Back to Top