సోషల్ మీడియా వాలంటీర్లపై వేధింపులు అరికట్టండి

విజయవాడ : వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాలంటీర్లపై రోజురోజుకు పోలీసుల వేధింపులు
పెరుగుతున్నాయని, అక్రమ కేసుల బనాయింపును నిరోధించాలని రాష్ట్ర డిజిపి
మాలకొండయ్యకు పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం సీనియర్ నాయకులు
మల్లాది విష్ణు, పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జి. దేవేందర్ రెడ్డి తదితరులు
డిజిపిని కలుసుకున్నారు. ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు
పెడుతున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసి, మరీ
పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పుడు కేసుల బనాయించి. వాలంటీర్లను భయపెడుతున్న
తీరును డిజిపికి వివరించారు. ఈ సందర్భంగా నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలోని
ఉదంతాలను వారు ఉదహరించారు. అదే సమయంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, నాయకులపైన
 పోస్టులు పెడుతున్న టిడిపి వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం
పక్షపాత ధోరణికి నిదర్శనంగా ఉందని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి వాటికి అడ్డుకట్ట
వేసి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలని వారు డిజిపిని కోరారు. ఈ అంశాన్ని
పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాని డిజిపి హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు
తెలిపారు.

Back to Top